VZM: మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణకు ఈనెల 11వ తేదీ వరకు పొడిగిస్తూ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినట్లు గజపతినగరం ఎక్సైజ్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ జె.జనార్దనరావు తెలిపారు. బుధవారం తన కార్యాలయంలో మాట్లాడుతూ అలాగే ఈ నెల 14వ తేదీన లాటరీ విజయనగరంలో ఉంటుందని చెప్పారు. గజపతినగరం సర్కిల్ పరిధిలో 15 దుకాణాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.