ప్రకాశం: సీఎస్ పురం మండల పరిధిలో శైవ క్షేత్రమైన భైరవకోనలో ఒంగోలు ఎస్పీ కార్యాలయానికి చెందిన డీఎస్పీ లక్ష్మణ కుమార్ ఆదివారం తన కుటుంబంతో కలిసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ భైరవేశ్వర స్వామి, ప్రముఖ దుర్గాదేవికి పూజలు చేశారు. ఆలయ అధికారులు డీఎస్పీని ఘనంగా సన్మానించి ప్రసాదాలను అందజేశారు.