ATP: పుట్టపర్తి కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం సీఐటీయు నాయకులు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ ఎస్ వెంకటేశ్, పాలసముద్రం గ్రామంలో నాసన్, బెల్ కంపెనీలకు భూములు కోల్పోయిన నిర్వాసితులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వాలని జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చామన్నారు.