SKLM: పోలాకి మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం నర్సంపేట జనసేన ఇంఛార్జ్ బలగా ప్రవీణ్ కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యికి పాల్పడిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, భక్తుల మనోభావాలను దెబ్బ తీయరాదని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11రోజుల పాటు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టిన సందర్భంగా అధ్యక్షులకి సంఘీభావం తెలిపారు.