నెల్లూరు: టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్రను విజయవాడలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో ఏపీ ఐఐసీ ఛైర్మన్గా నియమితులైన ఉండి మాజీ ఎమ్మెల్యే మంతెన రామరాజు శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఏపీఐఐసీ ఛైర్మన్ ఎన్నికైన సందర్భంగా బీద రవిచంద్ర పుష్పగుచ్ఛం అందజేసి శాలువాతో సత్కరించారు. అనంతరం ఇరువురు పలు రాజకీయ అంశాల గురించి చర్చించుకున్నారు.