ATP: ప్రైవేటు పాఠశాలల సమస్యలపై పోరాడుతామని అనంతపురంలోని రఘు సైనిక్ స్కూల్లో ఆదివారం ఏర్పాటు చేసిన ఉమ్మడి ప్రైవేటు పాఠశాలల సర్వసభ సమావేశంలో యూనియన్ నాయకులు గోపాల్ రెడ్డి తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఏపీపీఎస్సీ మాజీ ఛైర్మన్ వెంకటరామిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడిగా గోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడిగా గంగాధర్ యాదవ్‌ను ఎన్నుకున్నారు.