VZM: రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చి ఐదు నెలలు కావస్తున్న ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని సీపీఐ నాయకులు బుగత అశోక్ అన్నారు. ఆదివారం అమర్ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు మరిచి విద్యుత్ చార్జీలు పెంచేసారన్నారు. స్మార్ట్ మీటర్లు పెట్టి ప్రజలను దోపిడీ చేయడానికి సిద్దమవుతున్నారని ఆరోపించారు.