CTR: తుఫాను ప్రభావంతో అరణియార్కు వరద నీరు భారీగా పెరుగుతున్నట్లు ఏఈ లోకేశ్వర్ రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పైభాగాన ఉన్న అరుణానది, ఏలం కాలువల ద్వారా గంటకు 1030 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోందన్నారు. దీనివల్ల బుధవారం ఉదయం 5 గంటల సమయంలో ప్రాజెక్టు నీటి మట్టం 19.4 అడుగులకు చేరినట్లు ఏఈ వివరించారు.