ELR: ఏలూరుపాడులో అంబేడ్కర్ ఫ్లెక్సీని చింపివేసిన ఉండి. ఎమ్మెల్యే రఘురామపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు చలో ఏలూరుపాడుకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం పోలీసులు దళిత నాయకులను హౌస్ అరెస్టులు చేశారు. మాల మహానాడు నరసాపురం డివిజన్ అధ్యక్షుడు కాకీలేటి ఆనంద్ ను చిట్టవరంలోని ఆయన నివాసం వద్దే హౌస్ అరెస్ట్ చేశారు.