ప్రకాశం: పర్చూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చిన్నారుల కోసం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు రోటరీ క్లబ్ అధ్యక్షులు తోకల కృష్ణమోహన్ తెలిపారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం పర్చూరు రోటరీ భవన్లో మంగళవారం స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు 50 మంది ముందుకు వచ్చినట్లు తెలిపారు.