PLD: పరిమితి సంఘాలకు సెక్షన్ 80C క్రింద ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని నరసరావుపేట ఇన్కమ్ టాక్స్ ఆఫీసర్ రామశాస్త్రి అన్నారు. నరసరావుపేట జీ.డీ.సీ.సీ బ్యాంకులో అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్కమ్ టాక్స్ గుంటూరు వారి ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా సహకార శాఖ అధికారి వెంకట రమణతో చర్చించారు. వారు మాట్లాడుతూ.. ప్రాథమిక సహకార సంఘాలకు సెక్షన్ 80సి రాయితీ వర్తించదన్నారు.