VZM: జామి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి గురుస్వామి మూర్తి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అంబలం పూజను కన్నుల పండుగగా నిర్వహించారు. ముందుగా అయ్యప్ప విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, భజనలు చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా సత్య స్టూడియో అధినేత చుక్క ప్రసాద్ స్వామి వ్యవహారించారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది దీక్షపరులు పాల్గొన్నారు.