SKLM: ఎల్ఎన్ పేట స్థానిక ఎమ్మార్వోగా జె.ఈశ్వరమ్మ శుక్రవారం విధుల్లోకి చేరారు. ఇక్కడ ఎమ్మార్వోగా పనిచేసిన వై.వి.పద్మావతి బూర్జ మండల ఎమ్మార్వోగా బదిలీపై వెళ్లారు. బూర్జ మండలం పనిచేస్తున్న ఈశ్వరమ్మ ఎల్.ఎన్.పేటకు బదిలీ పై వచ్చారు. ఎమ్మార్వో ఈశ్వరమ్మని మర్యాదపూర్వకంగా రెవెన్యూ సిబ్బంది కలిసి అభినందించారు.