ప్రకాశం: కనిగిరి పట్టణంలోని స్థానిక దరువు బజార్లోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా ఈశ్వరి మాత సరస్వతి దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు ఆకుమల్ల విశ్వరూపచారి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తుడు ఎస్ రావు సింగ్ వెండి గొడుగును బహూకరించారు.