VZM: బొబ్బిలి మండలంలోని ఎం.బూర్జవలస గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై సర్పంచ్ సింగనపల్లి ఈశ్వరరావు, పంచాయతీ కార్యదర్శి కృష్ణవేణి వివరించారు. 100 రోజుల్లో ఎంతో ప్రగతి సాధించామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.