విపత్కర పరిస్థితుల్లో సాయం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని టోల్ ఫ్రీ నంబర్లను ప్రకటించాయి.
అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెంటనే 101 నంబర్‌కి సమాచారం ఇవ్వండి.
పోలీసుల సాయం కోసం 100 నంబర్‌కి డయల్ చేయండి.
ప్రాణాపాయ స్థితిలో అంబులెన్స్ కోసం 108 నంబర్‌కి కాల్ చేయండి.
ప్రభుత్వ అంబులెన్స్ కావాల్సిన సందర్భాల్లో 102 నంబర్‌కి డయల్ చేయండి.
మహిళలు అత్యవసర సమయాల్లో 1091 నంబర్‌కి కాల్ చేయండి.
పిల్లలు తప్పిపోయిన సందర్భాల్లో 1094 నంబర్‌కి కాల్ చేయండి.
తుపాన్లు, వరదల్లో చిక్కుకున్న వారు సాయం కోసం 1078 నంబర్‌కి డయల్ చేయండి.
విహారయాత్రకి వెళ్లినప్పుడు ఏదైనా సమస్య వస్తే సాయం కోసం 1363 నంబర్‌కి ఫోన్ చేయండి.
ఎయిడ్స్ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి మందులు, సాయం కోసం 1097 నంబర్‌కి కాల్ చేయండి.
సైబర్ క్రైం జరిగినపుడు 155620 నంబర్‌కి ఫోన్ చేయండి.
సడెన్‌గా ఇంట్లో గ్యాస్ లీకైతే 1906 నంబర్‌కి ఫోన్ చేయండి.