కోనసీమ: ఆత్రేయపురం మండలంలోని వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ సన్నిధిలో నిర్వహించే నిత్య అన్నదాన పథకానికి హైదరాబాద్ అశోక్ నగర్ వాస్తవ్యులు ఎడమడకల హరికృష్ణ కుటుంబ సభ్యులు రూ.51,116 విరాళాన్ని అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు దాత కుటుంబ సభ్యులకు స్వామి చిత్రపటాన్ని అందజేశారు.