KMR: గడువు దాటిన తర్వాత ప్రచారం నిషేధం అని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేడు సాయంత్రం 5 తర్వాత ప్రచారం నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని ఎస్పీ హెచ్చరించారు. జిల్లాలో 2 అంతర్జిల్లా చెక్ పోస్టులు, 2 అంతర్రాష్ట్ర చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నేటి సాయంత్రం నుంచి ఎన్నికలు జరిగే 10 మండలాల్లో మద్యం విక్రయాలు చేపట్టవద్దన్నారు.