KMR: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశానుసారం పోలీస్ కళాబృందం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలు, డయల్ 100, సోషల్ మీడియాపై కళాబృందం సభ్యులు పాటల ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఇంఛార్జ్ హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ శేషారావు, కానిస్టేబుల్ ప్రభాకర్, సాయిలు, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.