దక్షిణాఫ్రికాతో ఇవాళ కటక్ వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది. ఈ క్రమంలో, టీమిండియా కోచ్ గంభీర్, కెప్టెన్ సూర్యకుమార్, యువ ఆటగాడు తిలక్ వర్మ సహా కొందరు జట్టు సభ్యులు ఒడిశాలో పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి, ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేశారు.