GNTR: పొన్నూరులోని పార్కుల్లో అపరిశుభ్రత లేకుండా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ళ రమేష్ బాబు సిబ్బందికి సూచించారు. మంగళవారం అంబేద్కర్ పార్కును సందర్శించిన ఆయన, ప్రజలకు అసౌకర్యం కలగకుండా పార్కుల సుందరీకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, రాత్రివేళ అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేసేందుకు అధికారులు నిరంతరం నిఘా పెట్టాలన్నారు.