MNCL: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడిన డిసెంబర్ 9, విజయ్ దివస్ చారిత్రక నేపథ్యాన్ని స్మరించుకుంటూ మంగళవారం మందమర్రి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి BRS జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పూలమాల వేసి, పాలభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో విజయ్ దివస్ ఆవశ్యకత గురించి ప్రజలకు తెలిసేలా ప్రసంగించారు. KCR దీక్ష ఫలితంగా తెలంగాణ ఏర్పడిందన్నారు.