ADB: ఇచ్చోడ మండలం కోకస్ మన్నూర్లో మాజీ కేంద్రమంత్రి వేణుగోపాల చారి, బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ మంగళవారం పర్యటించారు. గ్రామంలో నిర్వహించిన సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొని కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.