TG: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మహాలక్ష్మి’ ఉచిత బస్సు పథకం నేటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మంత్రి పొన్న ప్రభాకర్ మహిళలు, RTC ఉద్యోగులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పథకం ద్వారా మహిళా సాధికారత సాధించడంతో పాటు మహిళలకు ప్రయాణ ఖర్చు లేకుండా చేశామన్నారు. ఇప్పటివరకు 252 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారని తెలిపారు.