తూర్పు కాంగోలోని సెంజ్ పట్టణం సమీపంలో బాంబు పేలడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటనలో దాదాపు 30 మందికిపైగా ప్రజలు మరణించగా.. మరో 20మందికిపైగా గాయపడ్డారు. ప్రభుత్వ అనుకూల సాయుధ ముఠాలకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.