KNR: వీణవంక మండలం రెడ్డిపల్లి గ్రామంలో ఇసుక లారీల రాకపోకలతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వందలాది లారీలు ఒక్కసారిగా రావడంతో ప్రతినిత్యం దుమ్ము, ధూళి, శబ్ద కాలుష్యంతో నరకం చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. రోడ్డు మీదకి రావాలంటే భయంగా ఉందని ఆందోళన చెందుతున్నారు.