PPM: వీరఘట్టం మండలం చిట్టపులివలస మామిడి తోటల్లో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. కళాధర్ తెలిపారు. పేకాట ఆడుతున్నట్లు వచ్చిన సమాచారంతో తమ సిబ్బందితో దాడి చేసి వీరిని అదుపులోకి తీసుకునమన్నారు. వారి నుంచి రూ.43,500 స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. పేకాట, పొట్టేలు పందేలు ఆడటం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.