KMR: జిల్లాలో 3వ విడతలో భాగంగా బాన్సువాడ, బీర్కూరు, డోంగ్లి, నస్రుల్లాబాద్, బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, పెద్ద కొడఫ్గల్ మండలాల్లో బరిలో ఉండే తుది అభ్యర్థుల జాబితాను అధికారులు నేడు ప్రకటించనున్నారు. నామినేషన్లు వేసిన అభ్యర్థుల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల లెక్క తేలనుంది. పలు గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు ఒకే ఒక్క నామినేషన్లు వచ్చాయి.