ATP: రోడ్డు సేఫ్టీ నియమ ఉల్లంఘనలపై కఠిన చర్యలు చేపడుతున్నట్లు ట్రాఫిక్ సీఐ వెంకటేశ్ తెలిపారు. అనంతపురంలోని టవర్ క్లాక్ వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ట్రాఫిక్ సీఐ మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ జగదీశ్ ఆదేశాల మేరకు రహదారి భద్రతను మెరుగుపరచడం, పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ట్రాఫిక్ నియమాలను కట్టుదిట్టం చేస్తున్నామన్నారు.