WGL: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించి వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ట్రాఫిక్ అదనపు డీసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. ట్రై సిటీ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వాహనదారులకు ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో అదనపు డీసీపీ ఆధ్వర్యంలో ట్రాఫిక్ పోలీసులు కౌన్సలింగ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపడం ప్రమాదకరమని సూచించారు.