KNR: మూడో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఈనెల 17న జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు పోటీచేసే అభ్యర్థులకు మంగళవారం 4గం. తరువాత గుర్తులు కేటాయించనున్నట్లు హుజురాబాద్ MPDO రాజేశ్వరరావు తెలిపారు. తెలుగు పేర్ల ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం గుర్తులు కేటాయించనున్నారు. దీంతో నచ్చిన గుర్తులు రావాలని అభ్యర్థులు కోరుకుంటున్నారు.