ADB: కంప్యూటర్ విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో తిరిగి ప్రారంభిస్తున్నందున గతంలో పని చేసిన కంప్యూటర్ టీచర్స్‌ను తిరిగి కొనసాగించాలని జిల్లా కంప్యూటర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు సోమవారం DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు. ఈ సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని డీసీసీ అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.