KMM: జీపీ మొదటి విడత ప్రచారానికి ఇవాళ సాయంత్రంతో తెరపడనుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. జిల్లాలో 7 మండలాల్లో 172, కొత్తగూడెం జిల్లాలో 8 మండలాల్లో 159 గ్రామాల్లో ఈ నెల11న ఎన్నికలు జరగనున్నాయి. పంచాయతీ పోరులో ఎప్పుడూ పెద్దగా కనిపించని బడా నేతలు సైతం ఈ ఎలక్షన్న్ను ప్రతిష్ఠాత్మకంగా భావించారు.