VZM: ఈ నెల 10 నుంచి నెల రోజులపాటు SBI గ్రామీణ ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో విజయనగరానికి చెందిన యువకులకు హౌస్ వైరింగ్ఫై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ భాస్కరరావు సోమవారం తెలిపారు. ఈ మేరకు శిక్షణలో చేరాలనుకునే వారు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు కలిగి ఉండాలని, ఆసక్తి గల యువకులు సంస్థ ఫ్యాకల్టీ హర్షను సంప్రదించాలని సూచించారు.