బాలీవుడ్ హీరో లక్ష్య ప్రధాన పాత్రలో దర్శకుడు రాజ్ మెహతా ‘లగ్ జా గాలే’ సినిమాను తెరకెక్కించనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో జాన్వీ కపూర్ కథానాయికగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రేమ, ప్రతీకారం లాంటి అంశాలతో యాక్షన్ డ్రామాగా ఇది తెరకెక్కనున్నట్లు, ఇందులో టైగర్ ష్రాఫ్ విలన్గా కనిపించనున్నట్లు టాక్. అంతేకాదు ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్లు సమాచారం.