అన్నమయ్య: పీలేరు సంచారదళం ఎఫ్ఆర్ఓ ఎస్. చంద్రశేఖర్ బృందం సోమవారం తెల్లవారుజామున పులిచర్ల వద్ద తనిఖీలు జరిపింది. అనుమానాస్పద కారును వెంబడించగా, రెడ్డివారిపల్లి వద్ద వదిలి స్మగ్లర్లు అడవిలోకి పారిపోయారు. పరిశీలించగా కారులో 87 కేజీల బరువున్న ఆరు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయి. వీటి విలువ సుమారు రూ.5,00,489 గా అధికారులు తెలిపారు.