SKLM: మాదకద్రవ్యాల నిర్మూలనకు పోలీసు శాఖ చేపట్టిన వినూత్న కార్యక్రమం కార్యరూపం దాల్చిందని శ్రీకాకుళం ఎస్పీ కె.వి.మహేశ్వర రెడ్డి తెలిపారు.సోమవారం ఎస్పీ కార్యాలయంలో అధికారులు తో సమీక్ష నిర్వహించారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జట్టి ఆధ్వర్యంలో గత నెల 12న ప్రారంభమైన ‘అభ్యుదయం’ సైకిల్ యాత్ర ఈ నెల 15న రణస్థలం చేరుకోనుందని, దీన్ని విజయవంతం చేయాలని ఆయన సూచించారు.