ADB: ఎన్నికల్లో ప్రలోభాలకు గురి కావొద్దని SP అఖిల్ మహాజన్ ప్రజలను కోరారు. ఆదివారం రాత్రి జైనథ్ మండల కేంద్రంలో పర్యటించి ప్రజలతో సమావేశమై మాట్లాడారు. నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను పూర్తి చేయాలని సూచించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులను పెట్టిన వారిపై పోలీసు చర్యలు తప్పవని హెచ్చరించారు.