TG: శంషాబాద్ ఎయిర్పోర్టులో మూడు విమానాలకు బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. అప్రమత్తమైన అధికారులు విమానాలను సురక్షితంగా ల్యాండింగ్ చేయించి, విస్తృత తనిఖీలు చేపట్టారు. రెండు అంతర్జాతీయ, ఒక దేశీయ విమానానికి బెదిరింపులు వచ్చాయి. దీని వెనుక ఉన్నవారిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.