CTR: ఆదివారం సాయంత్రం జీడి నెల్లూరు నియోజకవర్గం, ఎస్ఆర్ పురంలో తొమ్మిదేళ్ల రీచ్ల అనే చిన్నారిపై వీధి కుక్కల గుంపు దాడి చేయడంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే బాలికను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అధికారులు వీధి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.