KNR: ఖమ్మంలో జరిగే స్కూల్ గేమ్ ఫెడరేషన్ రాష్ట్ర స్థాయి బీచ్ వాలీబాల్ పోటీలకు చొప్పదండి జడ్పీహెచ్ఎస్ (బాలురు) విద్యార్థి బి. అభిమన్యు ఎంపికైనట్లు హెచ్ఎం ఎం.డి. జలీల్ తెలిపారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లా జట్టు తరఫున పాల్గొంటాడని పేర్కొన్నారు. డిసెంబర్ 8వ తేదీ నుంచి అండర్ 17 ఇయర్స్ విభాగంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.