E.G: హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం నిర్వహించిన వేడుకల్లో గోకవరం మండలం అచ్యుతాపురానికి చెందిన హోంగార్డు జీఎస్ ప్రకాశ్ (HG-932) ఉత్తమ సేవా పురస్కారాన్ని అందుకున్నారు. కోరుకొండ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ప్రకాశ్, విధి నిర్వహణలో చూపిన ప్రతిభకు గాను జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారు.