HYD: నేవీ వీక్ 2025 వేడుకల్లో భాగంగా, బోలారం నేవీ హౌస్లో డిసెంబర్ 6, 7తేదీల్లో నేవీ బ్యాండ్ కచేరీ నిర్వహించారు. రియల్ అడ్మిరల్ అశ్వని కుమార్ తికూ, వీఎస్ఎం దీనిని నిర్వహించారు. కమాండర్ సతీష్ ఛాంపియన్ నేతృత్వంలో ఈస్టర్న్ నేవల్ కమాండ్ బ్యాండ్ అద్భుత ప్రదర్శన ఇచ్చింది. నిన్న జరిగిన కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.