శ్రీకృష్ణునిపై భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకున్న ఘటన యూపీలోని బుడౌన్లో జరిగింది. పింకీ శర్మ(28) అనే యువతి కృష్ణుడిని తన భర్తగా నిర్ణయించుకుంది. ఉన్నత విద్య చదివిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు మొదట నిరాకరించినప్పటికీ, తర్వాత వారే దగ్గరుండి జరిపించారు. శ్రీకృష్ణుడిపై ఉన్న భక్తితో ఈ నిర్ణయం తీసుకుంది. కాగా, గతంలో ఇలాంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే.