SDPT: బెజ్జంకిలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవికి ఐదుగురు అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇస్కిల్ల ఐలయ్య, కొండ్ల వెంకటేశం, ద్యావనపల్లి శ్రీనివాస్, బొల్లం శ్రీధర్, సంఘ రవి మధ్య పోటీ జరుగుతోంది. మొత్తం 14 వార్డులు ఉండగా 12వ వార్డు సభ్యుడిగా తిప్పారపు మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 13 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.