సత్యసాయి: రొద్దం మండలం శేషాపురం గ్రామంలో టీడీపీ నాయకులు అరుణ్ రెడ్డి నూతన గృహప్రవేశం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అరుణ్ రెడ్డి ఏర్పాటు చేసిన పూజా కార్యక్రమంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.