ఇండిగో విమానాల రద్దు సంక్షోభానికి సంబంధించి ఇండిగో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి ఛైర్మన్, సీఈవో, బోర్డ్ మెంబర్లతో కలిపి క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్ ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. విమానాల పునరుద్ధరణకు ఈ గ్రూప్ చర్యలు తీసుకోనుంది. మరోవైపు విమానాల రద్దు కారణంగా.. రిఫండ్ ఇచ్చేందుకు చర్యలు వేగవంతం చేసినట్లు సమాచారం.