KRNL: తుగ్గలి పీహెచ్సీ వైద్యులు అమర్నాథ్ ఆదివారం ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్న డిస్పెన్సనేరీను అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం రూపంలో తెలియజేశారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పందించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా పీహెచ్సీ కేంద్రంలో ఉన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి అమర్నాథ్ తీసుకెళ్లారు.