TG: పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అప్పుల పాలైందని, బీఆర్ఎస్ పాలనలో ప్రజలు విసిగిపోయి కాంగ్రెస్ మాయ హామీలు నమ్మి ఓటు వేశారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఎన్ని అమలు చేశారని ప్రశ్నించారు. ఉచిత బస్సు, సన్న బియ్యం తప్ప మరేవీ అమలు కాలేదన్నారు. రాష్ట్రంలో గులాబీ జెండా పోయి.. చేయి గుర్తు వచ్చిందంతే అని ఎద్దేవా చేశారు.