BDK: మణుగూరు మండలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కరకగూడెం మాజీ ఎంపీటీసీ సురేందర్ తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సమక్షంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే పాయం పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వారు పార్టీలోకి చేరినట్లు వెల్లడించారు.